19/05/2025
తెలంగాణ రాష్ట్రం, జయశంకర్ జిల్లా మహదేవపూర్ మండలం కాళేశ్వరం శ్రీకాళేశ్వర ముక్తీశ్వరస్వామి ఆలయం, దట్టమైన అడవి మధ్యలో, చుట్టూ రమ్యమైన ప్రకృతి రమణీయతల మధ్యన, పవిత్ర గోదావరి నది ఒడ్డున వెలసిన ఈ క్షేత్రం చాలా ప్రాచీనమైనది.
ఇక్కడ గోదావరి, ప్రాణహిత నదులతో పాటు అంతర్వాహినిగా సరస్వతీ నది ప్రవహించడం వలన త్రివేణి సంగమ తీరమైన దక్షిణకాశీగా ప్రసిద్ధిచెంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, చత్తీస్గఢ్ రాష్ట్రాల నుంచి ఇక్కడికి భక్తులు తరలివస్తారు.