28/09/2026
ఆట కదా శివా…
ఆట కదా ఈ జనన మరణాలు… 💔
కానీ ఈ ఆట ఇంత కఠినంగా ఎందుకు శివా?
నిన్నటి వరకు మనతో మాట్లాడిన మనిషి…
నవ్విన మనిషి…
ఎలాంటి పెద్ద health issues కూడా లేకుండా ఉన్న మనిషి…
రెప్పపాటులో మన మధ్య లేకుండా పోవడం అంటే ఏంటి?
జీవితం ఇంత అనిశ్చితమా?
మనిషి ఇంత క్షణికమా?
ఈరోజు ఆ ఇద్దరు పిల్లలను చూస్తుంటే…
ఏ తల్లి కళ్లైనా చెమ్మగిల్లకుండా ఉంటాయా?
ఆ చిన్నోడు…
తన అమ్మ అంత్యక్రియలు చేస్తూ,
ఏడుపుని ఆపుకోవడానికి ఉక్కిరిబిక్కిరి అవుతుంటే…
చూస్తున్న మనసే తట్టుకోలేకపోయింది. 💔
ఎందుకు దేవుడా…
ఒక తల్లిని తన పిల్లల నుంచి ఇంత చిన్న వయసులో వేరు చేస్తావు?
వాళ్లను ఎంతమంది ఎంత ప్రేమగా చూసుకున్నా…
“అమ్మ” అనే చోటును ఎవరు నింపగలరు?
ఆమె పిలుపు…
ఆమె చేతి స్పర్శ…
ఆమె ప్రేమ…
ఆమె మందలింపు…
ఆమె ఒడిలో దొరికే భరోసా…
ఇవన్నీ పిల్లలకు మళ్లీ ఎవరు ఇస్తారు?
అమ్మ లేని లోటు ఎంత పెద్దదో…
అమ్మను కోల్పోయిన హృదయానికే పూర్తిగా తెలుస్తుంది.
Deepthi Reddy Madugula garu ఇంకా ఎంత జీవితం ఉంది…
ఎన్ని కలలు ఉన్నాయి…
ఎంత చేయాలి…
ఎంతమందికి తోడుగా ఉండాలి…
జీవితంలో ఇంకా ఏదో సాధించాలి అన్న తపన ఎంత ఉంది…
అవన్నీ ఒక్క క్షణంలో ఆగిపోయాయా ?
ఇంత చిన్న వయసులో…
ఇంత త్వరగా…
నిన్ను దేవుడు ఎందుకు తన దగ్గరకు తీసుకెళ్లాడో అర్థం కావడం లేదు.
కానీ చివరి క్షణంలో కూడా నువ్వు నువ్వుగానే ఉన్నావు …
నీ organs donate చేసి,
నువ్వు వెళ్లిపోతూ కూడా ఇంకొంతమందికి జీవితం ఇచ్చావు. 🙏🏻
నీ జీవితం ఆగిపోయిన క్షణంలో…
మరొకరి జీవితం మొదలైంది.
అది నువ్వు …
బ్రతికున్నప్పుడు కూడా ఇతరుల కోసం…
వెళ్లిపోయేటప్పుడు కూడా ఇతరుల కోసం. ❤️🩹
ఇప్పుడు నిజంగా మనుషులతో ఎక్కువగా కలవాలన్నా…
ఎక్కువగా ప్రేమించాలన్నా భయంగా ఉంది …
ఎందుకంటే…
మనసుకు దగ్గరైన వాళ్లు ఒక్కసారిగా వెళ్లిపోతే,
ఆ ఖాళీని భరించడం నరకంలా ఉంటుంది.
“చిన్న circle లోనే బ్రతకాలేమో…
ఎవరినీ అంతగా మనసుకు దగ్గర చేసుకోకూడదేమో…”
అని కూడా అనిపిస్తోంది.
కానీ వెంటనే ఇంకో నిజం గుర్తొస్తోంది…
మనం ఎంతకాలం ఉంటామో మనకు తెలియదు.
ఉన్నంతకాలం ప్రేమగా ఉండటం తప్ప
మన చేతిలో ఇంకేముంది?
నీ గురించి ఆలోచిస్తే కన్నీళ్లు వస్తున్నాయి.
నీ పిల్లలను చూస్తే గుండె ముక్కలవుతోంది.
నువ్వు లేవు అన్న మాట ఇప్పటికీ నిజంలా అనిపించడం లేదు.
We miss you forever, 💔
నువ్వు వెళ్లిపోయినా…
నీ ప్రేమ, నీ మంచితనం,
నువ్వు ఇచ్చిన జీవితం…
ఈ ప్రపంచంలో ఇంకా కొనసాగుతూనే ఉంటుంది.
నీ ఆత్మకు సద్గతి ప్రాప్తిరస్తు. 🙏🏻
ఓం శాంతి… శాంతి… శాంతిః. 🕉️