15/01/2023
ఈరోజు రాత్రి శ్రీ సన్నిధి ఛానల్ లో నా ఇంటర్వ్యూ
ప్రియ మిత్రులు అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు.ఈ రోజు రాత్రి 9 గంటలకు శ్రీ సన్నిధి youtube channel లో నా ఇంటర్వ్యూ వస్తోంది.ఒక గంటన్నర పైగా ఉండే ఈ ఇంటర్వ్యూ లో నేను అనేక ఆధ్యాత్మిక విషయాల పైన చాలా వివరంగా మాట్లాడాను...నా జీవితం , నేను ఆధ్యాత్మికత వైపు ఎలా వచ్చాను , నా పుస్తకాలు రాయడం వెనుక జరిగిన అద్భుత అనుభవాలు , జన్మ జన్మల కర్మ ఫలాలు ఎలా ఉంటాయి , ప్రారబ్ధ కర్మ నుంచి ఉపశమనం ఎలా కలుగుతుంది , అనేక యుగాల లో జరిగిన విషయాలు దర్శించిన అద్భుత అనుభవాలు...ఇలా అనేక విషయాల పై వివరంగా మాట్లాడాను ...
బహుశా ఇంతకు ముందు ఏ ఇంటర్వ్యూల లోనూ చెప్పని అనేక విషయాలు ఈ ఇంటర్వ్యూ లో చెప్పాను. కొన్ని మీకు ఆశ్చర్యకరం గానూ , నమ్మశక్యం కానట్లు కూడా ఉండవచ్చు...కానీ కొన్ని విషయాలు అందరికీ తెలియాలి అనే ఉద్దేశంతో ఆ విషయాలు చాలా ధైర్యంగా , చాలా స్పష్టంగా చెప్పాను. ఏ విషయాలు లోకానికి ఎప్పుడు బహిర్గత మవ్వాలో భగవత్ నిర్ణయం ప్రకారం జరుగుతుంది అని నా నమ్మకం. మీకు ఈ విషయాలు అన్నీ నచ్చుతాయి అని భావిస్తున్నాను.
ఇప్పటి దాకా నా గురించి అంతగా తెలియని వారికి ఈ ఇంటర్వ్యూ చూస్తే నా జీవితం , నా ఆలోచనలు గురించి చాలా విషయాలు తెలుస్తాయి.
ఈ ఇంటర్వ్యూ మీరు శ్రీ సన్నిధి (Sri sannidhi ) youtube channel లో ఈరోజు రాత్రి 9 గంటలకు చూడవచ్చును...ఈ ఇంటర్వ్యూ లింక్ కింద ఇస్తున్నాను.ఒక వేళ మీకు ఈ రోజు వీలు పడక పోయినా తర్వాత ఎప్పుడైనా ఈ లింక్ తో ఈ ఇంటర్వ్యూ నెమ్మదిగా చూడవచ్చును.
మీకు వీలు ఉంటే మీ టీవీ లో యూట్యూబ్ లో చూడండి.మరింత అనుకూలం గా ఉంటుంది.అలాగే ఇది చాలా లోతైన సబ్జెక్ట్ కాబట్టి ఒకటి రెండు సార్లు చూడండి...లేదా ఒక అరగంట ఒకసారి , తరువాత మరి కొంత అలా చూడండి.
ఈ విషయం మీ బంధువులతో , మిత్రులతో పంచుకోండి. ఇంటర్వ్యూ చూసి తమ అమూల్య అభిప్రాయాన్ని నాతో
Ph.9849443752 కి మెసేజ్ చేసి పంచుకుంటే సంతోషిస్తాను.
https://m.youtube.com/watch?v=YPPpQA1C1JA
శుభం భూయాత్
శ్రీ లక్ష్మి శ్రీనివాస కటాక్ష సిద్ధిరస్తు
మీ
విశ్వపతి
( తిమ్మరాజు విశ్వపతి రామకృష్ణమూర్తి )
http://www.lordofsevenhills.com/
pH.9849443752
Join this channel to get access to perks:https://www.youtube.com/channel/UCo9mV9RX-XYGD9k2ucKFV...